: సునామీని పసిగట్టొచ్చు... కానీ, ఆపలేం!


భూకంపం ద్వారా సునామీ రాబోతున్న సంగతిని కొన్ని పదుల నిమిషాల ముందే పసిగట్టగల సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే, ఇది సునామీని పసిగడుతుందే తప్ప దానిని ఆపడానికి ఏ మాత్రం ఉపకరించేది కాదు. కేవలం మనకు ముందుగా తెలియడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు... అంతే!

స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 2011లో జపాన్‌లో విలయం సృష్టించిన సునామీ లక్షణాలను అధ్యయనం చేశారు. ఇప్పటికే జపాన్‌ సునామీపై ప్రపంచవ్యాప్తంగా అనేకానేక అధ్యయనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి అధ్యయనంలో భవిష్యత్తులో రాబోయే సునామీలను ముందే గుర్తించవచ్చుననే సంగతి బోధపడింది. భూకంపం ఏర్పడినప్పుడు.. సముద్రగర్భంలో కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు ఏర్పడతాయి. ఈ శబ్దాలను బట్టి రాబోయే సునామీని దాని తీవ్రతను కూడా గుర్తించడం సాధ్యమట.

  • Loading...

More Telugu News