: సచిన్, వీరూల పనైపోయింది: కపిల్ దేవ్


చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో విధ్వంసక శతకంతో అలరించిన శిఖర్ ధావన్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారని.. ఇక సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ లు క్రికెట్ నుంచి తప్పుకోవచ్చని సలహా ఇస్తున్నాడు కపిల్ దేవ్. ఈ వెటరన్ ఆటగాళ్ళ గురించి ఇప్పుడు ఎవ్వరూ ప్రస్తావించడంలేదని, భారత క్రికెట్ కు ఇది స్పష్టమైన సంకేతమని చెప్పాడు. జట్టులో కొత్త రక్తం ఎక్కించాల్సిన తరుణం ఆసన్నమైందని కపిల్ అన్నాడు. కాగా, చాంపియన్స్ ట్రోఫీని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ చానల్ కు కపిల్ హిందీ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా కపిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News