: వక్రమార్గం పట్టిన మాజీ సర్పంచ్
అతని పేరు వాసు.. ప్రకాశం జిల్లా వేటపాలం మండలంలోని కొత్తపేట గ్రామ మాజీ సర్పంచ్. ఊరి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన అతగాడు వక్రమార్గం పట్టాడు. పినాకిని ఎక్స్ ప్రెస్ లో ఓ యువతిని అభ్యంతరకరరీతిలో సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ అడ్డంగా బుక్కయిపోయాడు. ఈ విషయమై ఒంగోలు పోలీస్ స్టేషన్ లో కేసు దాఖలు చేసింది బాధితురాలు. తక్షణమే స్పందించిన పోలీసులు మాజీ సర్పంచ్ వాసును అదుపులోకి తీసుకున్నారు.