: వచ్చే ఎన్నికల్లో బీజేపీ సారథి ఎవరో?


భారతీయ జనతా పార్టీ నిన్న మొన్నటి వరకు నిశ్చంతగానే కనిపించింది. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీయే ప్రధాని అభ్యర్థి అని ప్రచారం మొదలైందో లేదో లుకలుకలు మొదలయ్యాయి. ఓవైపు పార్టీలో భేదాభిప్రాయాలు, మరోవైపు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అలకలు.. ఇప్పుడు బీజేపీ అధినాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు సమాయత్తం కావాలంటే.. సరైన రథసారథి కావాలి. మోడీ పేరును ప్రకటిద్దామంటే, అద్వానీ తదితరులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారాయె. ఏదేమైనా గోవాలో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తుది రోజైన ఆదివారం ఈ వ్యవహారానికి తెరదించాలని కమలనాథులు భావిస్తున్నారు.

కాగా, గోవా సమావేశాలకు అద్వానీ గైర్హాజరవడం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ వివరణ ఇచ్చినా.. మోడీ పట్ల నిరసనపూర్వకంగానే అద్వానీ కార్యక్రమానికి రాలేదని కథనాలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News