: అకాల వర్షాలపై దృష్టి సారించిన సీఎం
రాష్ట్రంలో కురుస్తున్నఅకాల వర్షాలకు పలు చోట్ల పంట నష్టం జరగడంతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆ దిశగా దృష్టి సారించారు. అధికారులతో అకాల వర్షాలపై సమీక్షించారు. వెంటనే పూర్తి వివరాలు అందించాలని ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూస్ ను ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సూచించారు.
అల్పపీడన ద్రోణి కారణంగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కాగా, రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.