: రాష్ట్ర సర్కారు కూలదు: రఘువీరా
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ, 2014 వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా రాష్ట్ర సర్కారు కొనసాగుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.