: టీఆర్ఎస్ సత్తా తెలిసింది కదా!: అడుసుమిల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా ఏంటో సహకార ఎన్నికల ఫలితాలతో తెలిసింది కదా అని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదనడానికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చిన ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని అడుసుమిల్లి వ్యాఖ్యానించారు.