: బంగారు నాణేల రుణాలపై ఆర్ బీఐ ఆంక్షలు
పలు సహకార బ్యాంకుల్లో బంగారు నాణేలపై రుణాలు ఇవ్వడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఇకనుంచి 50 గ్రాములు దాటిన బంగారు ఆభరణాలపైనే రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు హైదరాబాదులో ఆర్ బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ.. చమురు, బొగ్గు దిగుమతులు అధికం కావడంవల్లే మూడేళ్లుగా కరెంటు ఖాతా లోటు ఏర్పడుతోందని అన్నారు. ముఖ్యంగా పంటల ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.