: ఢిల్లీ పర్యటనపై డిప్యూటీ సీఎం వివరణ
హోం శాఖ కావాలంటూ ఢిల్లీ వెళ్ళినట్టు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహపై వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. తాను హస్తిన వెళ్ళింది హోం శాఖ మంత్రి పదవి కోసం కాదని స్పష్టం చేశారు. పర్యటన ముగించుకున్న రాజనర్సింహ ఢిల్లీలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యహారాలపై అధిష్ఠానంతో చర్చించేందుకే ఇక్కడకు వచ్చానని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీని పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటివి పార్టీ పెద్దలతో చర్చించానని ఆయన వివరించారు.