: అది కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య: గజ్జెల కాంతం
ప్రజలను మభ్యపెట్టడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మించినవారు లేరని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ధ్వజమెత్తారు. కరీంనగర్ లో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన బలిదానాలు కేసీఆర్, కాంగ్రెస్ పార్టీల పుణ్యమేనని ఆరోపించారు. కేసీఆర్ కు 12 ఏళ్లుగా టీఆర్ఎస్ లో పనిచేస్తున్నవారు కనపడరని అన్నారు. అందుకే పార్టీలు మారినవారిని ప్రోత్సహిస్తూ, పెట్టుబడి దారులకు ప్రాధాన్యతనిచ్చి టీఆర్ఎస్ ను బూర్జువా పార్టీగా మార్చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ సోనియా కనుసన్నల్లో పనిచేస్తూ ప్రజలను మోసం చేసి మభ్యపెడుతున్నారని కాంతం మండిపడ్డారు.