: జిప్ మర్ లో ఏపీ విద్యార్దుల విజయకేతనం


ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్ మర్) జాతీయ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు విజయకేతనం ఎగురవేశారు. సికింద్రాబాద్ కు చెందిన రమేష్ చండేకర్ 200 మార్కులకు గానూ 174 పరుగులు సాధించి టాపర్ గా నిలిచాడు. ద్వితీయ స్థానంలో హేమంత్ అమర్ దీప్ సంతూర్(బెంగళూరు) నిలవగా, హైదరాబాద్ కు చెందిన టీఎన్ సీ ప్రణవ్ 172 మార్కులతో తృతీయ స్థానం సాధించాడు. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన బీ స్వప్న 161 మార్కులతో ఎస్సీ అభ్యర్ధుల్లో టాపర్ గా నిలిచింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో జిప్ మర్ స్వయం ప్రతిపత్తిగల సంస్థ. 150 సీట్ల కోసం జరిపే ఈ పరీక్షలో పుదుచ్చేరి అభ్యర్ధులకు 40 సీట్లు కేటాయించి, మిగిలిన సీట్లు ర్యాంకులను బట్టి కేటాయిస్తారు. ఏటా జరిగే జిప్ మర్ పరీక్షకు జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది.

  • Loading...

More Telugu News