: సోనియా మాజీ వ్యక్తిగత కార్యదర్శిపై కేసు మూసివేత


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాజీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ పై ఉన్నఅక్రమాస్తుల కేసును సీబీఐ మూసివేసింది. విన్సెంట్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును మూసివేస్తున్నట్లు సీబీఐ తన ముగింపు నివేదికలో పేర్కొంది. 2001లో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో సీబీఐ జార్జ్ పై కేసు నమోదు చేసింది. కర్ణాటక, ఢిల్లీ, కేరళలో వాణిజ్య ఆస్తులు.. ఢిల్లీలో వ్యవసాయ భూమి కలిగిఉన్నట్లు, బ్యాంక్ ఖాతాలో 1.5 కోట్లు ఉన్నాయని ఆరోపిస్తూ సీబీఐ అప్పట్లో పేర్కొంది. అయితే సరైన ఆధారాలు లభించకపోవడంతో చివరికి సీబీఐ కేసును మూసివేసిందని ఓ పత్రిక వివరించింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి కూడా విన్సెంట్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News