: తమ్ముడి టెలికాం టవర్లను లీజుకు తీసుకున్న అన్న
అంబానీ సోదరుల వ్యాపార బంధం మరింత బలపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన టెలికాం టవర్లను జీవితకాలానికి లీజుకు తీసుకున్నాడు. ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్... రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు 11వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించనుంది. ఈ డీల్ తో రిలయన్స్ కమ్యూనికేషన్స్ తనకున్న అప్పులను చాలా వరకు తీర్చుకుని ఊపిరి పీల్చుకోవడానికి తోడ్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు దేశవ్యాప్తంగా 45,000 టవర్లున్నాయి. వీటిని వినియోగించుకుని తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా 4జి సర్వీసులు ప్రారంభించాలని ముకేశ్ వ్యూహం.