: సబిత, ధర్మానను కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబిఐ


నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగిన జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు వైఎస్ జగన్మోహన రెడ్డి, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇటీవలే రాజీనామా చేసిన సబిత, ధర్మాన ప్రసాదరావులను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది. కోర్టు అనుమతిస్తే మాజీలిద్దరినీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News