: సత్తా చాటిన టీమిండియా


ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. పక్కా ప్రోఫెషనల్ ఆటతీరుతో సఫారీలను చిత్తు చేసింది. ఇంటాబయటా సమస్యలతో సతమతమౌతున్న టీమిండియా సన్నాహక మ్యాచ్ లలో విజయం సాధించినప్పటికీ సగటు అభిమానిని ఎక్కడో చిన్న శంక పీడిస్తూ ఉండేది. అసలే ఆల్ రౌండ్ ప్రావీణ్యం వున్న సౌతాఫ్రికా ఆటగాళ్ళు దున్నేస్తారేమో అనుకున్న వారి అంచనాలను పటాపంచలు చేస్తూ టీమిండియా చెలరేగింది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమిండియా 26 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. ధావన్, రోహిత్, జడేజా ల ధాటైన బ్యాటింగ్ తో రాణించిన టీమిండియా మంచి స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా జట్టు ఒక దశలో కాస్త పోటీ ఇచ్చినప్పటికీ, తరువాత ఏ దశలోనూ భారత్ ను ఓడించే ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. శిఖర్ ధావన్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

  • Loading...

More Telugu News