: చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపాధి అవకాశాలు: నాగార్జున
మీడియా, సినీ రంగాల్లో విరివిగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని సినీ నటుడు నాగార్జున అన్నారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ పిలిం మీడియా, జవహర్ లాల్ నెహ్రూ ఆర్టిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)తో అవగాహన ఒప్పంద కుదుర్చుకుంది. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పేర్వారం పద్మావతి, నాగార్జున ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇరు సంస్థల భాగస్వామ్యంతో సినీరంగానికి చెందిన నిపుణుల కోసం కోర్సులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ మీడియా, సినీ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తమ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. అలాగే సాంకేతిక నిపుణుల కొరతను తీరుస్తామన్నారు.