: సంగీత దర్శకుడు రాఘవులు అస్తమయం
ద్రోహి, జీవనతరంగాలు, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, మొగుడు కావాలి, బెబ్బులి పులి, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు ... ఇలా 175 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన జేవీ రాఘవులు (జట్టి వీర రాఘవులు) ఈ ఉదయం అనారోగ్యం కారణంగా రాజమండ్రిలో కన్నుమూశారు. ఈయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, ఘంటసాల మాస్టారి దగ్గర సహాకుడిగా పనిచేసి, ద్రోహి చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా కెరీర్ ను ఆరంభించారు. రాఘవులు మంచి గాయకుడు కూడా. పలు సినిమాలలో ఆయన జనరంజకమైన పాటలు పాడారు. రాఘవులు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది.