: ఈడు మామూలోడు కాదు...!


కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన అబ్దుల్‌ రజాక్‌ మామూలోడు కాదు... ఎందుకంటే మామూలు మనుషులకు సాధ్యం కాని అసాధ్యాలను ఇలా టక్కున తన పంటి బలంతో చేసేస్తున్నాడు. పైగా ఇది తనకు వంశపారంపర్యంగా వచ్చిన నైపుణ్యమని చెబుతున్నాడు.

అబ్దుల్‌ రజాక్‌ ఎంత బరువున్న వస్తువునైనా ఇట్టే తన పంటి బలంతో ఎత్తేస్తున్నాడు. ఎంత బరువు అంటే... 500 కిలోల రోలర్‌ను, వంద కిలోల దుంగలను, పెద్ద ఎడ్లబండి చక్రాలను విడివిడిగా తీసి వాటిని నోటబట్టి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో 70 కిలోల బరువున్న నాగలిని ఇలా తన నోటితో పైకి ఎత్తేశాడు. మొత్తానికి రజాక్‌ని అభినవ భీముడు అందామా...!

  • Loading...

More Telugu News