: సీఎం కిరణ్ పై జూపల్లి ఫైర్
కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు నేడు సీఎం కిరణ్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని దుర్మార్గుడిగా అభివర్ణించారు. సొంత నియోజకవర్గానికి వేల కోట్లు కేటాయించుకుంటూ, ఇతర నియోజకవర్గాలను చిన్నచూపు చూస్తున్నాడని సీఎంపై మండిపడ్డారు. తన నియోజకవర్గం కొల్లాపూర్ లో నేడు జూపల్లి మీడియాతో మాట్లాడారు. కొల్లాపూర్ వంటి అభివృద్ధి చెందని ప్రాంతాలకు కేటాయించిన కళాశాలలను రద్దు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఆ నిధులను ఇతర ప్రాంతాలకు మళ్ళిస్తూ కొల్లాపూర్ కు మొండిచేయి చూపిస్తున్నారని ఆరోపించారు.