: బీసీసీఐకి కొత్త రూపు


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త రూపు సంతరించుకుంది. పూర్వ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ తన అల్లుడు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో విధులకు దూరంగా ఉండగా.. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా జగ్ మోహన్ దాల్మియా క్రికెట్ బోర్డు పగ్గాలు చేపట్టారు. కాగా, శ్రీనివాసన్ వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసిన బీసీసీఐ కార్యదర్శి సంజయ్ జగ్దాలే, కోశాధికారి అజయ్ షిర్కేల స్థానాల్లో సంజయ్ పటేల్, వెంకటేశ్ లను నియమించారు.

ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన సమావేశంలో దాల్మియా మాట్లాడుతూ, జూన్ 10న ఢిల్లీలో బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం ఉంటుందని తెలిపారు. ఆ భేటీలో రాజ్ కుంద్రాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల నుంచి వివరాలు కోరామని, ద్విసభ్య బృందంతో తాము కూడా దర్యాప్తు చేస్తామని దాల్మియా వెల్లడించారు.

  • Loading...

More Telugu News