: శిల్పాశెట్టి చుట్టూ బిగుస్తోన్న బెట్టింగ్ ఉచ్చు!


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం మరో మలుపు తిరిగింది. రాజస్థాన్ రాయల్స్ సహయజమాని రాజ్ కుంద్రాకు బెట్టింగ్ లో ప్రమేయం ఉందని పోలీసులు ఇంతకుముందు పేర్కొనగా.. ఆయన భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా మ్యాచ్ లపై పందాలు కాసేదన్న విషయం నివ్వెరపరుస్తోంది. కుంద్రా మిత్రుడు ఉమేశ్ గోయెంకా పోలీసు విచారణలో ఈ సంగతి వెల్లడించాడు. భార్యాభర్తలిద్దరూ బెట్టింగ్ కు పాల్పడేవారని గోయెంకా తెలిపాడు. ఎంపిక చేసిన మ్యాచ్ పై పందెం కాయమని శిల్ప చెప్పేదని గోయెంకా వెల్లడించాడు. కుంద్రా, శిల్ప తన ద్వారానే ఐపీఎల్ టోర్నీలో బెట్టింగ్ చేశారని కూడా చెప్పాడు. దీంతో, త్వరలోనే పోలీసులు శిల్పా శెట్టిని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News