: రోహిత్ ఔట్... భారత్ 127/1
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో టీమిండియా నిలదొక్కుకుంటోంది. ఊహించని విధంగా ధావన్ కు జతగా రోహిత్ బరిలో దిగాడు. జాగ్రత్తగా బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ జట్టుకు మంచి ఆరంభం దొరికిది. ధావన్, రోహిత్ ఇద్దరూ అర్థ సెంచరీలు సాధించి మంచి జోరుమీదున్న దశలో మెక్ లారెన్ బౌలింగ్ లో రోహిత్ కొట్టిన షాట్ ను పీటర్సన్ ఒడిసిపట్టడంతో 127 పరుగుల వద్ద భారత్ తొలివికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ధాటిగా ఆడుతున్న ధావన్ కు కోహ్లీ జతకలిసాడు. ఇద్దరూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. దీంతో 28 ఓవర్లకు భారత్ స్కోరు 172/1. ధావన్ 85 పరుగులతోనూ, కోహ్లీ 13 పరుగులతోనూ ఆడుతున్నారు.