: వీరశివునికి జాక్ పాట్
డీఎల్ బర్తరఫ్ ను ఏకధాటిగా సమర్ధిస్తున్న కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డిని మంత్రి పదవి వరించనుందా? అవుననే సమాధానమిస్తున్నాయి అధికారపార్టీ వర్గాలు. వీరశివారెడ్డి వరస చూస్తుంటే కూడా అలాగే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎల్ సీఎంపై ఘాటు విమర్శలు ఎక్కుపెడుతుండడంతో కిరణ్ కుమార్ రెడ్డి వీరశివారెడ్డిని ప్రయోగిస్తున్నారని, అందుకే వీరశివారెడ్డి అతనిపై ఒంటికాలిపై లేస్తున్నారని అంటున్నారు. కడప జిల్లాలో ఉన్న విభేదాలను సీఎం సొమ్ముచేసుకుంటున్నారని, డీఎల్ విమర్శలకు సమాధానం చెప్పేందుకు వీరశివారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయంగా కన్పిస్తో్ందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, డీఎల్ కాంగ్రెస్ పార్టీలోను, ప్రభుత్వంలోను కలుపుమొక్కగా ఉన్నాడంటూ వీర శివారెడ్డి శివాలెత్తిపోతున్నాడని చెబుతున్నారు.