: కేసీఆర్ మోసాలను తిప్పికొడదాం: బాబు


కేసీఆర్ పై టీడీపీ ఎదురుదాడి ప్రారంభించింది. గత కొన్నిరోజులుగా తెలంగాణలోని రాజకీయ మార్పులను నిశితంగా పరిశీలిస్తున్న బాబు కేసీఆర్ మోసాలను తిప్పికొట్టేందుకు ఇదే సరైన సమయమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేరుగా కేసీఆర్ పైనే దాడి చేస్తుండడంతో టీడీపీ విమర్శలలో పదును పెంచింది. ప్రత్యేక తెలంగాణలో 12 శాతం రిజర్వేషన్లంటూ ఎస్టీలను మోసగిస్తున్న కేసీఆర్ వెైనాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం రాజ్యంగాన్ని సవరణ చేస్తే కాని సాధ్యంకాని ఎస్టీ రిజర్వేషన్ల అంశాన్ని తాను సాధిస్తాననడాన్ని ఎండగట్టాలని సూచించారు. ఈ రోజు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో జిల్లాల వారీగా ఎస్సీ ఎస్టీలకు పార్టీ పదవులు, టికెట్ల కేటాయింపుపై జరిగిన సమావేశంలో బాబు ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News