: ప్రధాన నగరాల్లో విద్యుత్ కోతల ఎత్తివేత
నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రం క్రమేణా చల్లబడుతోన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా విద్యుత్ కోతలు ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే, తొలుత హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో విద్యుత్ కోతలు ఎత్తివేస్తారు. ఇక గ్రామాల్లో 6 గంటలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో విద్యుత్ కోతలను 2 గంటలకు కుదించనున్నారు.