: మరింత గ్యాస్ ఉత్పత్తికి రిలయన్స్ ప్రణాళికలు


కేజీ బేసిన్ డీ6 క్షేత్రంలో తాజాగా బయటపడ్డ గ్యాస్ నిక్షేపాలతో మరింత గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగం సిద్దం చేస్తోందని ఆ కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ రోజు ముంబైలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, 2015 నాటికి మధ్యప్రదేశ్ సోహాగ్ పూర్ లోని సీబీఎం బ్లాక్ లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభిస్తామని అన్నారు. దీని ఉత్పత్తికి రానున్న మూడేళ్లలో 1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని తెలిపారు. ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తే దేశీయంగా ఉన్న గ్యాస్ కష్టాలనుంచి గట్టెక్కవచ్చని రిలయన్స్ కంపెనీ చెబుతోంది.

  • Loading...

More Telugu News