: మీడియాపై శిల్పాశెట్టి మండిపాటు


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో తన భర్త, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాపై మీడియాలో వస్తున్న కథనాలపై నటి శిల్పాశెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా కుంద్రాపై ఇటువంటి అసత్య కథనాలు చేయడం సరికాదని శిల్ప తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో రాసింది. అమర్యాదకరమైన ప్రకటనలు చేస్తూ భరించలేని విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిక్సింగ్ కేసుకు సంబంధించి తమ పూర్తి సహాయం ఉంటుందని పేర్కొంది. ఫిక్సింగ్ వ్యవహారంలో సంబంధాలున్నాయన్న అనుమానంతో కుంద్రాను నిన్న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 12 గంటల పాటు విచారించారు. ఈ ఉదయం ఢిల్లీ పోలీసులు పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. దాంతో కుంద్రాను పోలీసులు అరెస్టు చేస్తారంటూ మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి.

  • Loading...

More Telugu News