: నా ఇంట్లో వాళ్లు ఇకపై క్రికెట్ చూడరు: విందూ


స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయ్యి బెయిల్ పై బయటపడ్డ విందూ దారాసింగ్ తన కుటుంబంలో ఎవరూ మరోసారి క్రికెట్ చూడబోరని అన్నారు. బెట్టింగ్ లో, స్పాట్ ఫిక్సింగ్ లో తన పాత్ర ఎంత మాత్రం లేదన్నాడు. అరెస్టయిన సంజయ్ జైపూర్, పవన్ జైపూర్ లు బుకీలు కాదని, వారు తనకు బాగా తెలుసని, తన మిత్రులని చెప్పాడు. వారి గురించి పోలీసులు తనను ప్రశ్నించలేదని వివరించాడు. పనిలో పనిగా మీడియాపై విందూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మీడియా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, అతి చేస్తోందని అన్నాడు.

  • Loading...

More Telugu News