Chaaver: పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా 'చావెర్' .. సోనీలివ్ లో!

  • కుంచాకో బోబన్ హీరోగా రూపొందిన 'చావెర్'
  • గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సాగే కథ 
  • క్రితం నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 24వ తేదీ నుంచి ఓటీటీ ట్రాక్ పైకి

Chaaver movie streaming date confirmed
Listen to the audio version of this article

మలయాళంలో అక్టోబర్ లో థియేటర్లకు వచ్చిన సినిమాలలో 'చావెర్' ఒకటి. అరుణ్ నారాయణ్ నిర్మించిన ఈ సినిమాకి, టినూ పప్పచ్చన్ దర్శకత్వం వహించాడు. కుంచాకో బోబన్ .. ఆంటోనీ .. అర్జున్ అశోకన్ .. సాజన్ గోపు .. సంగీత మాధవన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 

అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి మంచి రేటింగ్ వచ్చింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 24వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. రాజకీయాలను టచ్ చేస్తూ సాగే యాక్షన్ డ్రామా ఇది. రౌడీయిజం .. ప్రతీకార దాడులతో ఈ కథ నడుస్తుంది. 

నేపథ్య సంగీతం ... ఫొటోగ్రఫీ పరంగా ఈ సినిమా మంచి పేరును తెచ్చుకుంది. కుంచాకో బోబన్ నటన హైలైట్ గా నిలిచింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కంటెంట్ చూస్తుంటే మిగతా భాషల వారికి కూడా కనెక్ట్ అయ్యేలానే ఉంది. 

More Telugu News