Martin Luther King: సోనీలివ్ కి సంపూ సినిమా .. 'మార్టిన్ లూథర్ కింగ్'

  • 'మార్టిన్ లూథర్ కింగ్' గా సంపూ 
  • క్రితం నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 29 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ 
  • గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ


Martin Luther King movie streaming date confirmed
Listen to the audio version of this article

సంపూర్ణేశ్ బాబు నుంచి రీసెంట్ గా వచ్చిన సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్' అక్టోబర్ 27వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమా థియేటర్స్ కి వచ్చి, వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా 'సోనీలివ్' లో ఈ నెల 29 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

ఇద్దరు అన్నదమ్ములు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారు. ఇద్దరికీ కూడా సమానంగా ఓట్లు వస్తాయి. అప్పుడు హీరో ఓటు కీలకంగా మారుతుంది. తన ఓటు ప్రెసిడెంట్ ఎవరనేది డిసైడ్ చేస్తుందని తెలిసిన హీరో ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ.

గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో కామెడీ ప్రధానంగా నడిచే కథ ఇది. సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, నరేశ్ .. వెంకటేశ్ మహా .. శరణ్య ప్రదీప్ .. గోపరాజు రమణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. స్మరణ్ సాయి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి. 

More Telugu News