: వాజ్ పేయి క్షేమంగానే ఉన్నారు: బీజేపీ
వాజ్ పేయి ఆరోగ్యం మరింత క్షీణించిందంటూ వస్తున్న వార్తలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. వాజ్ పేయి క్షేమంగానే ఉన్నారని, ఆయనను ఆస్పత్రిలో చేర్పించడం నిజం కాదని స్పష్టం చేసింది. ఆయనపై వస్తున్న వార్తా కథనాలన్నీ తప్పుదోవపట్టించేవేనని బీజేపీ ఒక ప్రకటన జారీ చేసింది. 88ఏళ్ల వాజ్ పేయి వయసుకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఆయనను ఆస్పత్రిలో చేర్పించారంటూ వార్తలు వెలువడుతుండడంతో బీజేపీ ఈ ప్రకటన వెలువరించింది.