: మినీ వరల్డ్ కప్ నేటి నుంచే
మినీ వరల్డ్ కప్ లా భావించే చాంపియన్స్ ట్రోఫీ ఇంగ్ల్ండ్ లో నేడే ప్రారంభం కానుంది. ఎనిమిది జట్లు 15 మ్యాచ్ లతో క్రికెట్ ప్రియులకు రెండు వారాల పాటు అలరించనున్నాయి. తొలి మ్యాచ్ నేడు కార్డిఫ్ లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. మొత్తానికి హాట్ ఫేవరెట్ భారతే.