: హైహీల్స్‌తో కాస్త జాగ్రత్త!


హైహీల్స్‌ చెప్పులు వేసుకునే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైహీల్స్‌ వేసుకునే వారి పాదాలకు శాశ్వతమైన గాయాలు అవుతాయని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. అందునా కాలికి సరిగా సరిపోని చెప్పులను వేసుకోవడం వల్ల ఆర్థరైటిస్‌, ప్రాక్చర్లు, నాడీ సమస్యలతోబాటు అనేక దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని నయం చేయాలంటే స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం లేదా శస్త్ర చికిత్స చేయడం ఒక్కటే మార్గమని పాదాలకు చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాలికి సరిగా సరిపోని చెప్పులను వేసుకునే మహిళల్లో సగానికి సగం మందికి పైగా ఇలాంటి సమస్యలే వస్తున్నాయని పాదాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు మైక్‌ ఓనీల్‌ తెలిపారు. మహిళల్లో సుమారు 43 శాతం మంది ఫ్యాషన్‌ కోసం వేసుకుంటున్నాం కాబట్టి కాసేపు ఇబ్బంది అయినా ఫరవాలేదు అనుకుంటూ ఇలాంటి హైహీల్స్‌ని వేసుకుని లాగించేస్తున్నారట. ఇలాంటి చెప్పులను వేసుకున్న ఒక గంట ఆరు నిమిషాలా 48 సెకన్లకంతా వారి పాదాల్లో నొప్పి మొదలవుతుందట. మరికొందరిలో చెప్పులు వేసుకున్న పది నిమిషాలకే నొప్పి ప్రారంభమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఎత్తు చెప్పులు వాడనేల... లేని జబ్బు తెచ్చుకోనేల...!

  • Loading...

More Telugu News