: 'బల ప్రదర్శన' చేసిన డీఎల్
అమర్యాదకరరీతిలో బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి బల ప్రదర్శనకు ఉపక్రమించారు. పదవీచ్యుతుణ్ణయినా, ప్రజాదరణ తగ్గలేదని నిరూపించుకోవాలని యత్నించారు. ఈ క్రమంలో కడప జిల్లా మైదుకూరు వద్ద భారీ బహరంగ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున జనసమీకరణతో తన హవా తగ్గలేదని చాటే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా డీఎల్ మాట్లాడుతూ, సీఎం కిరణ్ పై నిప్పులు చెరిగారు. కిరణ్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంలా తయారైందని విమర్శించారు. తన పట్ల సీఎం వ్యవహరించిన తీరు ఆయన నిరంకుశత్వానికి తార్కాణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.