: సర్వేలను నమ్ముకుంటోన్న కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో తామే విజేతలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఇటీవలి సర్వేలను ఉదహరిస్తున్నారు. సర్వేలన్నీ తమవైపే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. నేడు నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పైచేయి సాధించడం తథ్యమని జోస్యం చెప్పారు. 100 ఎమ్మెల్యే సీట్లు, 16 ఎంపీ సీట్లు తమవే అని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని అన్నారు.