: ఈ పెట్రోలు బంకును ఖైదీలే నిర్వహిస్తారు!


వివిధ నేరాలకు పాల్పడి జైలుకు చేరే వ్యక్తులను సంస్కరించడమే జైళ్ళ శాఖ ముఖ్య విధి. ఈ క్రమంలో ఖైదీల సంక్షేమమే పరమావధిగా చంచల్ గూడ జైలు అధికారులు వినూత్న ఆలోచనకు తెరదీశారు. ఖైదీలే నిర్వహించేలా ఓ పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు. చంచల్ గూడ జైలు వద్దే నెలకొల్పిన ఈ పెట్రోల్ బంకును రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభాకర్ వి థామస్ నేడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జైళ్ళ శాఖ ఐజీ సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ తరహా పెట్రోల్ బంకులు స్థాపించేందుకు ఇతర రాష్ట్రాలు తమను వివరాలు కోరుతున్నాయని అన్నారు. మన రాష్ట్రంలో ఖైదీలు నిర్వహించే పెట్రోల్ బంకును కడప, రాజమండ్రి, వరంగల్ తర్వాత చంచల్ గూడలోనే ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News