: 'పవిత్ర' మడమ తిప్పే అమ్మాయి కాదు: శ్రియ
తన నూతన చిత్రం 'పవిత్ర' గురించి శ్రియ నేడు ఓ చానల్ తో ముచ్చటించారు. ఆ చిత్రంలో వేశ్యగా ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రియ సినిమా విశేషాల గురించి చెబుతూ.. 'పవిత్ర' క్యారెక్టర్ ధైర్యసాహసాలు కలిగి ఉంటుందని తెలిపారు. ఎన్ని కష్ఠాలు ఎదురైనా, మడమ తిప్పే రకం కాదని అన్నారు. కొన్ని సినిమాల్లో ఇలాంటి పాత్రలు జీవితంలో ఓటమిపాలై చివరికి మృత్యువును ఆశ్రయిస్తాయని.. కానీ, 'పవిత్ర' ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించదని, ధైర్యంగా సమస్యలకు ఎదురొడ్డి పోరాడుతుందని ఆమె చెప్పారు. ఈ సినిమాలో అన్ని అంశాలు సమపాళ్ళలో ఉంటాయన్నారు.
ఓ వేశ్య రాజకీయాల్లోకి వచ్చి ఏం చేసిందనేది 'పవిత్ర' ఇతివృత్తం. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి జనార్థన మహర్షి దర్శకత్వం వహించారు. సాధక్ కుమార్, మహేశ్వరరెడ్డిలు నిర్మాతలు కాగా, ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.