: ధాయ్ లాండ్ ఓపెన్ ప్రీక్వార్టర్స్ లో భారత క్రీడాకారిణులు
ధాయ్ లాండ్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో టీం ఇండియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. టోర్నీలో మహిళల సింగిల్స్ లో భారత క్రీడాకారిణులు ప్రీక్వార్టర్ ఫైనల్ లో అడుగు పెట్టారు. డిఫెండింగ్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ తన తొలిగేమ్ లో చైనా క్రీడాకారిణి షిన్ హాన్ హంగ్ పై 21-11, 21-16 తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ లో అరుంధతి కొరియా క్రీడాకారిణి మిన్ జి లీ ని 21-14,9-21,21-15 తేడాతో ఓడించింది. పురుషుల సింగిల్స్ లో సాయి ప్రణీత్, అజయ్ జయరామ్, ప్రణయ్, ఆనంద్ పవార్, శ్రీకాంత్ లు అద్భుతమైన ఆటతీరుతో రెండో రౌండ్లో అడుగుపెట్టారు.