: భారత్, ఆస్ట్రేలియా రక్షణ సంబంధాలు ఇక దృఢతరం
ఆస్ట్రేలియాతో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ నెల 4,5 తారీఖుల్లో ఆస్ట్రేలియా రక్షణ మంత్రి స్టీఫెన్ స్మిత్ తో భారత రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పలు చర్చలు జరిపారు. పెర్త్, కాన్ బెర్రా నగరాల్లో జరిగిన ఈ సమావేశాల్లో ప్రధానంగా.. మిలిటరీ పరిజ్ఞానం బదలాయింపు, తరచు రక్షణ శాఖల చర్చలు, సముద్ర జలాలపై పహారా, సంయుక్త నావికాదళ విన్యాసాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం పాటుపడాలని ఇరు దేశాల రక్షణ మంత్రులు తీర్మానించారు. ఇక హిందూ మహాసముద్రంలో చైనా తన నావికా దళాన్ని భారీగా మోహరించడం పట్ల వారు ఆందోళన వెలిబుచ్చారు.