: యువకులపై సైనికుల దాష్టీకం


నడుస్తున్న రైల్లోంచి ఆరుగురు యువకులను భారత సైనికులు కిందికి తోసేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 'అవధ్ అస్సామ్' ఎక్స్ ప్రెస్ రైలు మొరాదాబాద్ ను సమీపిస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రైలు వెళ్ళిపోతోందన్న హడావిడిలో ఆ యువకులు ఆర్మీ కోసం కేటాయించిన బోగీలో ఎక్కడం సైనికులకు ఆగ్రహం తెప్పించింది. తర్వాతి స్టేషన్లో దిగిపోతామని వేడుకున్నా ఆ సైనికుల చెవికెక్కలేదు. ఆ యువకులను దూషించిన సైనికులు ఒక్కసారిగా వారందరినీ కిందికి తోసివేశారు. దీంతో, వారందరికీ గాయాలయ్యాయి. వారిలో ఓ వ్యక్తి తలకు బలమైన దెబ్బలు తగిలాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, దురుసుగా ప్రవర్తించిన సైనికులపై ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News