Nara Lokesh: ఒక పని చేయండి... రాజద్రోహం కేసు పెట్టి ఉరిశిక్ష వేసేయండి: నారా లోకేశ్

  • మోత మోగిద్దాం కార్యక్రమంలో విజిల్స్ వేసిన 60 మందిపై కేసులు పెట్టారని లోకేశ్ మండిపాటు
  • సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కేసులు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా
  • ఆదేశాలు ఇచ్చినోడికి సరే.. అమలు చేసినోడి బుద్ధి ఏమయిందని మండిపాటు
Nara Lokesh anger on filing cases against 60 people who participated Motha Mogiddham programme

టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమానికి ఆ పార్టీ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అయితే ఆ కార్యక్రమం సందర్భంగా విజిల్స్ వేసి సౌండ్ చేశారంటూ 60 మందిపై పోలీసులు కేసులు పెట్టాని టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. విజిల్ వేస్తే పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వీరి తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు వేసుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. 'ఒక పని చేయండి... రాజద్రోహం కేసు పెట్టి ఉరిశిక్ష వేసేయండి' అని మండిపడ్డారు. జగన్ కు పిచ్చి పీక్స్ లో ఉన్నట్టుందని అన్నారు. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే... అమలు చేసినోడి బుద్ధి, బుర్ర ఏమయిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఒక వార్తా పత్రికలో వచ్చిన వార్తను షేర్ చేశారు.

More Telugu News