Renu Desai: టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో 'హేమలతా లవణం' పాత్రలో రేణూ దేశాయ్

  • రవితేజ ప్రధాన పాత్రలో టైగర్ నాగేశ్వరరావు
  • వంశీకృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం
  • ప్రముఖ సంఘ సంస్కర్త పాత్రలో నటిస్తున్న రేణూ దేశాయ్
  • రేణూ దేశాయ్ లుక్ పంచుకున్న చిత్రబృందం 
Renu Desai as Hemalatha Lavanam in Ravi Teja starring Tiger Nageswararao

మాస్ మహారాజా రవితేజ, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. పేరుమోసిన స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

 అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఓ ఆసక్తికర పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో ఆమె నటిస్తున్నారు. రేణూ దేశాయ్ పాత్రకు సంబంధించిన లుక్ ను చిత్రబృందం నేడు పంచుకుంది. 

కాగా, టైగర్ నాగేశ్వరరావు చిత్ర ట్రైలర్ ను అక్టోబరు 3న విడుదల చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబయిలో ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దసరా సీజన్ లో అక్టోబరు 20న టైగర్ నాగేశ్వరరావు చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. 

కాగా, ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. రవితేజ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. అంతేకాదు, రవితేజకు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News