Hyderabad: హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

  • హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీరు
  • ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు
  • మూడ్రోజుల పాటు వర్షాలు ఉన్నాయని తెలిపిన వాతావరణ కేంద్రం
Heavy rain in hyderabad

హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం వర్షం కురవడంతో భాగ్యనగరం తడిసిముద్దయింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. హిమయత్ నగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, కోఠి, చార్మినార్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్టీకాపూల్, ట్యాంక్ బండ్, చంద్రాయణగుట్ట, బహదూర్ పుర, హబ్సిగూడ, మల్లాపూర్, నాచారం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనారులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయమంతా నగరాన్ని మేఘాలు కమ్మివేశాయి. సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బుధ, గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురవవచ్చునని తెలిపింది.

More Telugu News