: విజయసాయి లొంగుబాటు
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు విజయసాయిరెడ్డి నేడు సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. విజయసాయి బెయిల్ గడువు నేటితో ముగిసింది. దీంతో, ఆయనకు 17 రోజుల రిమాండ్ విధిస్తూ సీబీఐ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. విజయసాయిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నట్టు సమాచారం.