: ఇక నక్సల్స్ తో పోరాటమే : రమణ్ సింగ్
నక్సల్స్ తో మిగిలింది పోరాటమేనని, చర్చలకు అవకాశమే లేదని తేల్చిచెప్పారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, ఇటీవల మావోయిస్టులు జరిపిన బస్తర్ దాడి... వారితో చర్చలకు అవకాశమే లేకుండా చేసిందని అన్నారు. సంఘవిధ్రోహ శక్తులతో చాలాకాలంగా పోరాడుతున్నామని, మరింతకాలం కూడా పోరాడతామని రమణ్ సింగ్ తెలిపారు.