: జగన్ వ్యతిరేకులపై సీఎం ప్రతీకారం: రేవంత్ రెడ్డి
జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలపై ముఖ్యమంత్రి ప్రతీకారం తీర్చుకుంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగన్ ను జైలు నుంచి విడిపించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిందని, టీఆర్ఎస్ ది కూడా అదే పరిస్థితి అన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని వదలిపెట్టి ప్రతిపక్షమైన టీడీపీని విమర్శిస్తున్నాయన్నారు.