: గుజరాత్ లో మరోసారి బీజేపీ విజయకేతనం
గుజరాత్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. నాలుగు అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా అన్నిటిలోనూ బీజేపీయే విజయపతాకం ఎగురవేసింది. దీంతో గుజరాత్ ప్రజల్లో నరేంద్రుడి పట్టు మరోసారి నిరూపితమైంది. మరోవైపు బీహార్ లో జరిగిన ఒక లోక్ సభ స్థానంలో అధికార జనతాదళ్ యునైటెడ్ ఓటమిపాలైంది. ఆ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి గెలుపొందారు. నరేంద్రుడికి విజయం, నితీష్ కు అపజయం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.