: మోడీ పేరును బీజేపీ నిర్ణయించలేదు : వెంకయ్యనాయుడు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నిర్ణయించలేదని ఆ పార్టీ సినియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. త్వరలోనే పీఎం అభ్యర్ధిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రధాని పదవికి అర్హులైన నేతలు బీజేపీలో చాలామంది ఉన్నారని ఆయన అన్నారు. అయితే, బీజేపీ ప్రధాని అభ్యర్ధి వ్యవహారంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొంతమంది ఇటువంటి ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు. హైదరాబాదులోని పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు.. కాంగ్రెస్ లోనే అభిప్రాయ బేధాలున్నాయని విమర్శించారు. బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవన్నారు.