: నిర్మాత నటనా దాహం
నటులను తెరపై తమదైన శైలిలో చూపించే దర్శకులు అప్పుడప్పుడు తాము కూడా స్క్రీన్ పై కనిపించాలని తహతహలాడుతుంటారు. దాంతో చిన్న చిన్న సన్నివేశాల్లో కనిపిస్తుంటారు. ఇదే కోవలో బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఓ చారిత్రాత్మక చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యాడు. 'బాంబే వెల్వెట్' పేరుతో రణ్ బీర్ కపూర్ హీరోగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో పూర్తిస్థాయి పాత్రలో కరణ్ తన నటనను చూపించబోతున్నాడు.
తన పాత్రలో పలు భిన్నమైన ఛాయలు కనిపిస్తాయని 41 సంవత్సరాల ఈ ఫిల్మ్ మేకర్ ఓ ప్రకటనలో తెలిపాడు. దశాబ్దంన్నర కిందట వచ్చిన 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' చిత్రంలో షారుక్ ఖాన్ స్నేహితుడిగా కరణ్ తొలిసారి నటించాడు. ఆ తర్వాత మళ్లీ షారుక్ నటించిన 'ఓం శాంతి ఓం', 'లక్ బై ఛాన్స్' చిత్రాల్లో కనిపించాడు. ఈ మూడు చిత్రాల్లో కరణ్ తక్కువ సమయం ఉండే చిన్న పాత్రల్లోనే కనిపించాడు.