: కుంభమేళాలో వీఐపీలతో భక్తుల ఇక్కట్లు
అలహాబాద్ మహాకుంభమేళాలో వీఐపీలు యదేచ్ఛగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఈ రోజు వసంత పంచమి కావడంతో ఓ వైపు లక్షలాది భక్తులకు సౌకర్యాలు కల్పించడం నిర్వాహకులకు తలకు మించిన భారం అవుతోంది. అయినా వీఐపీలకు అవేమీ పట్టడం లేదు. ఉత్తరప్రదేశ్ కు చెందిన బీఎస్ఎఫ్ డీజీ సుభాష్ జోషి, లక్నో డిఐజీ నవనీత్ శిఖేరాలు కుటుంబాలతో కుంభమేళాకు వచ్చారు. తమ అధికార వాహనాలలో దర్జాగా గంగా తీరాలను తిరిగారు. ఓ కుటుంబం బోటులో గంగానదిలో షికారు చేసింది.
అలహాబాదులో భక్తులు పవిత్ర స్పానాలు చేసే గంగా పరీవాహక ప్రాంతాల్లోకి వాహనాలను అనుమతించవద్దని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు తమకు తెలియవని స్వయంగా ఈ అధికారులే అనటం కుంభమేళాలో పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇలాంటి తరుణంలో రాబోయే మహశివరాత్రి పర్వదినాన కుంభమేళాలో స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఈ సమయంలో అయినా వీఐపీల తాకిడి లేకుండా చూడాలని మహాకుంభమేళా ఇంఛార్జి మంత్రి అజాం ఖాన్ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.